← కీర్తనలు

353. క్రీస్తుని బోలియుందును

రాగం: బేహాగ్|తాళం: ఏక|రచయిత: సి. రవివర్మ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నేను క్రీస్తు ప్రభుని జేరి నేను క్రీస్తువాడ నౌదు నేను క్రీస్తు సొత్తు గాన నేను నా సమస్తమును నాధు డేసు కిపుడు యిత్తు ||నే||
1.  నేను క్రీస్తు ననుభవించి నేను క్రీస్తు బోలియుందు నేను నా స్వరూపమందు నా ప్రభుండు గానుపింప నేను నేసులో వసింతు ||నే||
2.  నేను క్రీస్తునందునుండి నేను క్రీస్తులో బెరుగుదు నేను క్రీస్తు దారినడచి నేను క్రీస్తు మనసు నెపుడు గానుపఱతు నెల్లెడను ||నే||
3.  నేను క్రీస్తు సేవజేసి నేను క్రీస్తు సాక్షినౌదు నేను క్రీస్తు సాధ నంబె నేను యనుభవించు రక్ష ణానందంబు జాటెదెపుడు ||నే||
4.  నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు నేను, క్రీస్తు కలిసియున్న నాశన తనయుని శక్తి నేలగూలు నద్భుతముగ ||నే||