355. Come to the Saviour

రచయిత: జి.ఎఫ్. రూట్
పల్లవి:యేసుని జేరఁ వేగము రా మార్గముఁ జూపి వేదములో దాపున నుండి క్రీస్తు దయన్ రమ్మని పిల్చును. || సంతసంబు సంతసంబు బల్ పాపశుద్ధి మేము పొందఁగా యేసుని యెద్దనుండ సదా మోక్ష పథంబున ||
1. బాలురమైన మమ్మును దా నెంతటి ప్రేమతోఁ బిలుచున్ యేసుని స్వీకరించుటకై వత్తుము వేగమే.
2. నా ముద్దు బిడ్డ రమ్మనఁగా నాతని ప్రేమ కన్పడఁగా నాయన నేఁడు నిన్చిలువన్ రానని యందువా? ||