← కీర్తనలు

352. యేసు నా రక్షకుడు

రాగం: ముఖారి|తాళం: అట|రచయిత: రావి జాన్ సుందరరావు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని స్తోత్రింతును వెరువను నేనిక నెవ్వరికిన్ వెలుగైన యేసే నా దుర్గము
1.  అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన యుగయుగంబుల నేలెడి ప్రభువు యఘముల బాపి నను వెలిగించును ||వెలు||
2.  నా దీపమును వెలిగించు ప్రభువే నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును నా దోషము లెల్లను దన కాంతిలో నాదరముగ కడిగి రక్షించును ||వెలు||
3.  పలువిధ శోధనల్ నను జుట్టినను విలువగు సంపద లంతరించినను వెలుగుదూత నాపై యురులొడ్డిన నలయక నిత్యము నడచెద వెల్గులో ||వెలు||
4.  తల్లిదండ్రులు విడచినగాని యుల్లము భీతిని భయమందినను ఎల్ల ప్రజలు నను ద్వేషించినను ఎడబాయడునా ప్రియుడగు యేసు ||వెలు||
5.  క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తముగ గనుడి ప్రియులార శాశ్వతంబగు రాజ్యము చేర సత్వరమాయన వెలుగును బొందరె ||వెలు||