← కీర్తనలు

343. There is a fountain filled with blood

రచయిత: విలియం కొనర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును ||యేసుండు నాకు మారుగా ఆ సిల్వఁ జాపఁగా శ్రీ యేసు రక్త మెప్పుడు స్రవించు, నాకుఁగా ||
1.  ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధుఁ డాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదు.
2.  నీ యొక్క పాప మట్టిదే నిర్మూల మౌటకు రక్షించు గొఱ్ఱె పిల్ల? నీ రక్తంబె చాలును.
3.  నా నాధు రక్తమందున నే నమ్మి యుండినన్ నా దేవుని నిండు ప్రేమ నే నిందుఁ జూచెదన్.
4.  నా యా యుష్కాల మంతట నా సంతసం బదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన మిద్దియే.