కీర్తనలు

344. నూతన జన్మము

రాగం: శంకరాభరణము|తాళం: ఏక|రచయిత: తూపిలి రంగయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను ||పరమ||
1.  వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు పరిసయుండు మదిని దలఁచుచున్ ||పరమ||
2.  అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి పిలిచి పల్కె హితవుతోడను ||పరమ||
3.  బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు నీ బోధ నెఱుఁగుదున్ ||పరమ||
4.  మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి పాప నరులు చేయరు ||పరమ||
5.  అనుచుఁ బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమునఁ దనకు నిట్లు దెలిపెఁ జాలి మనసుతోడను ||పరమ||
6.  క్రొత్త జన్మ మెవ్వఁడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తఁబడఁ డటంచు నిజము క్రీస్తు పల్కెను ||పరమ||
7.  వినుచుఁ బరిసయుండు ముసలి జనుఁడు మఱల తల్లి గర్భ మునను తిరుగనెట్లు బుట్టు ననుచుఁ బల్కెను ||పరమ||
8.  అందు కేసు తెల్పె జలము నందుఁ నాత్మయందు జన్మ మొంద కున్న మోక్ష రాజ్య మొంద రనుచును ||పరమ||