← కీర్తనలు

342. Rock of ages, cleft for me

రచయిత: అగస్గస్ మాంటేగు టాన్లేడీ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నాకై చీల్చఁబడ్డ యో నా యనంత నగమా నిన్ను డాగి యందునఁ చెను మీరఁ బారెడు రక్త జలధారలా సక్తిఁ గ్రోలఁగా నిమ్ము.
1.  నేను నాదు శక్తిచే నిన్నుఁ గొల్లఁజాలను కాల మెల్ల నేడ్చినన్ వేల క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనె బాపఁజాలను.
2.  వట్టి చేయి చాఁచుచున్ ముట్టి సిల్వఁ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్కఁ జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాధ, పాపము.
3.  ఈ ధరిత్రియందున నేఱు దాఁటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చఁబడ్డయో నా యనంత శైలమా నన్ను ఁ జేరఁ దీయుమా