← కీర్తనలు

339. Sinners Jesus will receive

రచయిత: ఎర్డ్మాన్ న్యూమీస్టెర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంతటఁ జాటించుఁడి ||హల్లెలూయ హల్లెలూయ యెంత పాపి నైనను యేసు చేర్చుకొనున టంచుఁ బ్రకటించుఁడి||
1.  మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైనఁ దా నిచ్చి చేర్చుకొనును.
2.  తన దివ్య సిల్వచేఁ దీసి పాప శాపమున్ నన్ బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను
3.  ఘోర పాపి నైనను నన్ను ఁ జేర్చుకొనును పూర్ణశుద్ధి నిచ్చును స్వర్గమందుఁ జేర్చును