పల్లవి:
యేసుఁడు రాఁగన్ జేసిన దోషము నాశన మాయెన్ ||యేసుఁడు||
1. చింతలు పోయెన్ వింతగ నాకున్ జెంతకుఁ జేర్పఁగ సంతస మాయెన్ ||యేసుఁడు||
2. సిలువను మోసెన్ గలువరి మెట్టన్ చెలువుగఁ బాపపు బలువును దించెన్ ||యేసుఁడు||
3. శిరమున ముండ్లున్ గరమున మేకులున్ స్థిరముగ నాటఁగ బరమును జూపెన్ ||యేసుఁడు||
4. పదముల మేకులున్ జెదరఁగ రక్తము ఎద నిఁకఁ బ్రేమతో ముదము నొసంగెన్ ||యేసుఁడు||
5. రక్షణ జూపెన్ దక్షుఁడు నాకున్ పక్షముతో నిఁక మోక్షము జూపెన్ ||యేసుఁడు||
6. రక్తిగ వేఁడన్ శక్తి నొసంగెన్ రక్తము జల్లియు ముక్తిని జూపెన్ ||యేసుండు||
7. గురువును నమ్ముదున్ భారము వెడలెన్ ధీరునిఁ జేయుచు దారిని జూపెన్ ||యేసుఁడు||
