← కీర్తనలు

331. మారుమనసుఁ బొందుట

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: బి.కోటయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు క్షీణం బగుచున్నది గదవే ||మనసా||
1.  చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక యెంతసేపు నీ యంతట నుండెదవే ||మనసా||
2.  లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన ప్రభువును ప్రాకటముగ నమ్ము ||మనసా||
3.  మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమని నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా ||మనసా||
4.  రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియే సమయము తక్షణమున వేఁడు ||మనసా||
5.  అందరమును గూడి యేసుని మందిరమునఁ జేరి పొందుగ క్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందునఁ జేరుదము ||మనసా||