పల్లవి:
ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాప ముండఁజూచి యేసు నండఁజేరి మన గుండె పదిలముఁ జేసి ||ఖండింప||
1. అంధత్వమునను రక్షణమార్గ మందుఁ జేరకయు ఎందెందుఁ జూ చిన సందులేక పాప మందు మునిఁగి నరలా నందమోందక చెడిరి ||ఖండింప||
2. ఎందు కీ భ్రమలు నీ యందుండు సందేహము వీడు పొందుగ యేసు సం బంధు డవై యున్న నందమైన మోక్ష మందుఁ జేరుట కొఱకు ||ఖండింప||
3. బెదరక నీవు సాతానుని నెదిరింపవలెను కుదురుగ నీ యేసు చదరునఁ జేరిన వదరుబోతు లెల్ల నెదురాడ లేరిఁక ||ఖండింప||
4. ఆసింపబోకు లోకభోగములు మోసమై యుండు వాసిగ యేసుని దాసుఁడవైయున్న గాసిఁ జెందక మోక్ష దాసుఁడ వౌదువు ||ఖండింప||
5. నమ్మి జీవించు యేసుని యందు నెమ్మదిఁ బొందు రమ్ము యేసుని యొద్ద సొమ్ము నీకున్నది సమ్మతించి మదిని నెమ్మదిగాఁ జూచి ||ఖండింప||
