పల్లవి:అనుపల్లవి:
రాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు ||అప||
రాధిని యేసయ్య కృప జూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు ||అప||
1. సిలువకు నిను నే గొట్టితిని తులవలతో జేరితిని కలుషంబులను మోపితిని దోషుండనేను ప్రభువా ||అప||
2. ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో ||అప||
3. ముళ్లతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ ||అప||
4. దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితినీ దేహంబుగాయంబులను ||అప||
5. ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని క్రూరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా ||అప||
6. చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత నిందలు పెట్టితినయ్యో సందేహమేలనయ్యా ||అప||
7. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా ||అప||
