← కీర్తనలు

329. క్షమాపణ వేడుట

రాగం: కమాసు|తాళం: త్రిపుట|రచయిత: సిరిపురపు కృపానందము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని యేసయ్యా పాప భారము క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా ||పాపి||
1.  వేష భాషలతోడ నిండి మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి నిన్ను చేరితి దాసునిగ బ్రోవు యేసయ్యా ||పాపి||
2.  నీతి లేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవు మయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపి||
3.  నీదు సిలువలోని ప్రేమ నెంచదర మౌన? యేసయ్యా నాదు కలుష మంత బాపి కనికరింపు మా యేసయ్యా ||పాపి||
4.  నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల జేయుమయ్యా నీతిసూర్యుండా యేసయ్యా ||పాపి||
5.  దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి యేసయ్యా పాపశాపము బాపి నిత్య జీవమిడవయ్యా యేసయ్యా ||పాపి||
6.  శాంతి గోరువార లెల్లనీ చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపి||
7.  పరమరక్షక నీదు ప్రేమ నెరుగ తరమౌన యేసయ్యా పరుల మైన మమ్ము బ్రోవ వేచియున్నావా యేసయ్యా ||పాపి||
8.  నాదు హృదయము నీదెసుమ్మా నీవె గైకొనుమా యేసయ్యా శుద్ధ హృదయము జేసి నను నీ సుతునిగా జేయు యేసయ్యా ||పాపి||