← కీర్తనలు

323. క్రైస్తవ పశ్చాత్తాపము

రాగం: అఠాణ|తాళం: ఆది

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ సేవఁ జేయ మమ్ముఁ జేపట్టుటకు ||రావయ్య||
1.  హద్దు లేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్ధులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||
2.  నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబు లన్నియు ఖండించుటకు ||రావయ్య||
3.  మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగాఁ జేసి దారిఁ జూపుటకు ||రావయ్య||
4.  పాపుల మయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబు లన్నియుఁ పారఁ దోలుటకు ||రావయ్య||
5.  అందమైన నీదు పరమానంద పురమందు మే మందరముజేరి ఆనందించుటకు ||రావయ్య||