కీర్తనలు

324. పాప పశ్చాత్తాపము

రాగం: నాధనామక్రియ|తాళం: రూపకము|రచయిత: జొన్నకూటి దేవదానం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు మ్రోల కావరించి నిన్నుమఱచి యేక మైతి బామరులతో నేది దారి నిన్నుఁ జేర నేమో తెలియదాయెను ||ఏ ముఖంబు||
1.  నీచ పాప వర్తనంబు పేచ మెల్లఁ బాపి ముందు కాచి పెంచి నియము నిష్ఠ లాచరణము నిలుపుకొరకు దోషభార మెల్ల బాపఁ బూచినీ దె నిజముగా ||ఏ ముఖంబు||
2.  తుట్టతుదకు నిన్ను ఁ జేరఁ గట్టినాఁడం గంకణమును వట్టిమాటకాదు నిజము పట్టి నడుపు పరమ పురికిఁ బట్టికొనుమునాదు చేయి మట్టి పాలు కాకమునుపే ||ఏ ముఖంబు||