← కీర్తనలు

322. క్రీస్తు మోక్ష మార్గము

రాగం: ఆనందభైరవి|తాళం: కురుజంపె|రచయిత: మిక్కిలి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శరణు నా యేసు ప్రభువా నీవెగా పరలోకమునకుఁ ద్రోవ కరుణతో నన్నుఁ గావ నీ కన్న గర్త యెవ్వఁడు యేసువా ||శరణు||
1.  పర సుఖము విడిచినావు కన్యక మరియగర్భమున నీవు ధరణి నుదయించినావు నీ కన్న దాత యెవ్వఁడు యేసువా ||శరణు||
2.  పాపభారము క్రిందను బడి యున్న పాపాత్ములను నెల్లను జేఁపట్టి రక్షింపఁగా నీ కన్న శ్రేష్ఠుఁ డెవ్వఁడు యేసువా ||శరణు||
3.  మరణమై లేచినావు జీవింప మార్గంబుఁ జూపినావు పరమహిమ జూపినావు నీ కన్నఁ ప్రభుఁ డెవ్వఁడు యేసువా ||శరణు||