← కీర్తనలు

315. ఉన్న విధముననే నీ యొద్దకు వచ్చుచున్నాను

రాగం: ముఖారి|తాళం: త్రిపుట|రచయిత: పురుషోత్తము ఛౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న||
1.  కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||
2.  మసి బొగ్గువలె నా మా నస మెల్లఁ గప్పె దో ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటుఁ గడిగి పవిత్ర్ర పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||
3.  వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె నెమ్మది దొల గెను పలు విధములగు సందియంబుల వలనఁ బోరాటములచే నే నలసి యిటునటుఁ గొట్టఁబడి దు ర్భలుఁడనై గాయములతో నిదె ||ఉన్న||
4.  కడు బీదవాఁడ నం ధుఁడను దౌర్భాగ్యుఁడను జెడిపోయి పడి యున్నాను సుడివడిన నా మదికి స్వస్థతఁ జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ బడయవలసిన వన్ని నీ చేఁ బడయుటకు నా యెడ యఁడా యిదె ||ఉన్న||
5.  నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గముఁ గంటిని కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న||
6.  దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైన యన్నిటి విఱుగఁగొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాఁడ నవుటకు మఱి నీవాఁడ నవుటకే ||ఉన్న||