కీర్తనలు

314. దావీదు కీర్తన 51

రాగం: శంకరాభరణము|తాళం: ఏక

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత ||దేవా||
1.  ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు జేయవె తండ్రీ! ||దేవ||
2.  నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని ||దేవ||
3.  నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను ద్రుంచుచున్నది ||దేవ||
4.  పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది తల్లి ||దేవ||
5.  ఎదయందు సత్యంబే యెడఁగోరు చుందువు హృదయమందున జ్ఞాన మొదవ జేతువు నాకు ||దేవ||
6.  కలిగించు నాలో ని ర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున ||దేవ||
7.  త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ శుద్ధాత్మను నాలో ||దేవ||
8.  నీ రక్షణానంద మో రక్షకా మరల చేరదీసి యిచ్చి స్థిరపరచు నా మనసు ||దేవ||
9.  కావవే కర్తార క్తాపరాధమునుండి కావు నే నుత్సాహ గానంబుఁ జేసెద ||దేవ||
10.  ప్రభువ! నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా విభవముగఁ గొనియాడ విప్పు నా పెదవులను ||దేవ||
11.  కోరువాఁడవు కావీ వారయ నర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు నీకు ||దేవ||
12.  విఱిగిన మనసే నీ విలసిత యర్పణము అరయ నలిగిన హృదయ మతి ప్రియంబౌ నీకు ||దేవ||