← కీర్తనలు

316. పాపపు టొప్పుకోలు

రాగం: కేదారగౌళ|తాళం: ఏక|రచయిత: చిక్కాల పాలస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవఁజేతు నో ప్రభో మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి యాదరించు మక్కువైన దేవ తనయ ||దిక్కులేని||
1.  ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలార రండటంచును భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది తుదిని నీ దరిఁ జేరితి నన్నాదరించుము ||దిక్కులేని||
2.  బలము లేని వాఁడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని ప్రభో ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలఁగ జేసి యాత్మ కధిక బలము నొసగి మునుపు మయ్య ||దిక్కులేని||
3.  పామరుండ నౌట వల్లను నే నెఱుఁగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు విశ్వసించి ప్రేమను వర్తింపజేయు ||దిక్కులేని||
4.  వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి సందియము లణంచు మో ప్రభో సందియ మెడబాపి శాస్త్ర మందు నుండు సార వాక్యానంద పదవు లనుభవింప డెందము వెలిఁగింప వయ్య ||దిక్కులేని||