← కీర్తనలు

306. సువార్త

రాగం: ఆహిరి|తాళం: ఆది|రచయిత: ఎస్.జె.మోజెస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా పాపుల మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా ||పాపిని||
1.  నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా ||పాపిని||
2.  జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా నెపముల జెప్పెడు అపవాదిని విడి కృపవాదినిగని బ్రతుకో మనసా ||పాపిని||
3.  మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా మానుగ గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా ||పాపిని||
4.  మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా మరణ బంధముల బరిమార్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా ||పాపిని||
5.  మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు ఓ మనసా తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా ||పాపిని||