← కీర్తనలు

305. రక్షకుని యొద్దకు రండి

రాగం: మారువ|తాళం: ఆట|రచయిత: జి.జాన్ తాతయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము ప్రియులారా రండి పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను ||రండి||
1.  ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు ||రండి||
2.  పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును ||రండి||
3.  పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు జేసిన పాపభారము దీసి శాంతిని గూర్చు యా ప్రభు నొద్దకిపుడే ||రండి||
4.  భావమందున దెలియుడి మీరలు నిత్య జీవమార్గము గనుడీ పావ నుండగు క్రీస్తు మిమ్మును పావనులుగా జేసి నూతన జీవము నొసంగి పర మున జేర్చు మిమ్మును నిశ్చయముగా ||రండి||