కీర్తనలు

307. యేసుక్రీస్తు సమాధానకర్త

రచయిత: ఎ.బి.మాసిలామణి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా, శాంతికరా ||హే ప్రభు||
1.  శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా, జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
2.  తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా ||సిల్వధరా||
3.  మతములు వెదకిన నిన్నెగదా వ్రతములు గోరిన నిన్నెగదా పతి తులు దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా ||సిల్వధరా||
4.  పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా మలమల మాడిన మానవహృదయము కలకలాడెకదా ||సిల్వధరా||
5.  కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వపతాకము దానము జేసెగదా ||సిల్వధరా||
6.  దేవుని బాసిన లోకములో చావుయె కాపురముండెగదా దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా ||సిల్వధరా||
7.  పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండెగదా దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి వీవెగదా ||సిల్వధరా||
8.  ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవెగదా ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా ||సిల్వధరా||
9.  కలువరిలో నీ శాంతి సుధా సెలయేఱుగ బ్రవహించెగదా కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా ||సిల్వధరా||