← కీర్తనలు

304. రక్షణ మార్గము

రాగం: సౌరాష్ట్ర|తాళం: ఆట|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప భాగ్యంబులు ||వినరే||
1.  దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి యేసువు తెల్పె ||వినరే||
2.  మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ దన ప్రాణమర్పించి ||వినరే||
3.  మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు మైత్రిని దలఁచుచు ||వినరే||
4.  తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున నెమ్మది ||వినరే||
5.  తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును తగిన సహాయ్యంబు ||వినరే||