← కీర్తనలు

303. కాలము గతించిపోవుచున్నది

రాగం: జంఝూటి|తాళం: త్రిపుట|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పోయెఁగ పోయెఁగ కాలము వెళ్లి పోయెఁగ పోయెఁగ మాయ సంసార సం పదఁ గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయెఁ దరిగి ||పోయెఁగ||
1.  ఇలలో నెందరు నీతో నీడైనవారు కలఁ గాంచి మేల్కొన్న గతి మడసినారు ||పోయెఁగ||
2.  జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు గొయ్యి వెదకు ||పోయెఁగ||
3.  ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాఁడె కాటి పాలౌను ||పోయెఁగ||
4.  మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు కొన్నావు ||పోయెఁగ||
5.  చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు గానంగలేవ ||పోయెఁగ||
6.  జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు ||పోయెఁగ||