← కీర్తనలు

302. శుభవర్తమాన ప్రకటన

రాగం: బ్యాగు|తాళం: ఆది

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు విని యెద రీ జగతిన్ భాసుర నయ మను బంధము గలిగిన భక్తుల కిది సౌ భాగ్యముగా ||యేసు||
1.  దాసుల మొఱలను దప్పక వినుచును ధైర్యము నొసఁగెడి దాత సుమీ దోసముల గమిఁ ద్రోయ బలముగల దొడ్డ దొరకు నుతి దూతలచేన్ ||యేసు||
2.  పాప నరులఁ గని పావనం బొనర్చను భార మనని ఘన బంధు వుఁడు ఆ పరమ జనకు నాజ్ఞఁ బడసి నెరి యాఢ్యుఁడిడుమ లొందె నుయిలన్ ||యేసు||
3.  సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్ చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు శ్రీకరుఁడౌ ||యేసు||
4.  పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ మునన్ పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత భాస్కరుఁడౌ నా ||యేసు||
5.  దుషులు ననుఁ గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి యించుక పగ మది నెంచను నా ||యేసు||