పల్లవి:
యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను బాపు నండి దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే||
1. దేవుఁ డీతఁడే సుమండి దిగులుపడకండి మన చావు నొంది లేచెనండి జీవ మితఁడండి ప్రభు ||యేసునే||
2. పాపులను ప్రేమించె నండి ప్రాణ మిడె నండి ప్రభు దాపుఁజేరి వేఁ డ రండి దయామయుఁడండి ప్రభు ||యేసునే||
3. నరకబాధ నొందె నండి నరులకొర కండి ప్రభు దురితములను బాపు నండి దుఃఖపడకండి ప్రభు ||యేసునే||
