కీర్తనలు

295. మానవ పతనము

రాగం: శంకరాభరణము|తాళం: త్రిపుట|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారి కనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా ||మన||
1.  తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరిన మఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా ||మన||
2.  పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరి శుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా ||మన||
3.  నరవంశజుల కెల్లఁ తరలెఁ దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మర ణంబు మన పాప హరణంబుఁ గావించు నన్నలారా ||మన||