← కీర్తనలు

293. పాపుల స్నేహితుడు

రాగం: మోహన|తాళం: ఏక

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పాపులకు సఖుండు మన ప్రాపు యేసె సుమండి భువి పాపులకు సఖుండు ||పాపులకు||
1.  రండి రండి మిత్రులార నిండు ధైర్య పడండి వేగమె దండైన యండ మన కుండు యేసుండని ||పాపులకు||
2.  దాహ మణంచు దేవ వాక్యము దేహధారులార రండి దేహీ యన విహీనుల సాహాయ్యము నోహో యని ||పాపులకు||
3.  ద్రవ్య మించుక లేని విక్రయ మయ్య యీ యేసయ్య రక్తము చేయలే మయ్య మన మయ్య దుర్నయ్యముల్ ||పాపులకు||
4.  నిండు మనసు గలిగియే సండఁజేర రండి వేగమె నిండు ప్రియుండు న ఖండ పురుషుండని ||పాపులకు||
5.  నింద లన్ని పొంది ప్రభుని మందలో వెలుఁగొందరే తఱిఁ పొం దుగ నిందలో నుందు రానందమున ||బాపులకు||