292. పాపము సార్వత్రికము

రాగం: కేదారగౌళ • తాళం: త్రిపుట • రచయిత: పురుషోత్తము చౌధరి
పల్లవి:నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై లేఁడు వృజినములచేఁ జెడిన మదిని బ విత్రమూలం బెటుల బొడమును ||నిజము||
1. దురిత లతలకు మూలకందము దుస్స్వభావము దానిఁ గూడిన నరులలోఁ బరిశుద్ధ విధు లె న్నటికిఁ గనరావు నెరవుగా సద్ధర్మములనే తెఱఁగుననుఁ గావింప నేర్తురు ధరణి లోపల ముసిఁడి చెట్టున చెఱకు రస ముండునె తలంపగ ||నిజము||
2. మనసు క్రియ లన్నిటికి మూలం బనుచు శాస్త్రము పల్కు మఱి యా మనసు శుచిగాకున్న నగునే తనకు క్రియాశుద్ధి అనిశ మా హృదయము దురిచ్ఛల నలరి మిధ్యాసక్తి నుండఁగ ఘనతగల సత్యార్య ముల నిల మనుజుఁడె ట్లొ నరింపఁజాలును ||నిజము||
3. నిరతమును పాపాగ్నిచేతను గరగుచున్న మనంబులోపల పరమ ధర్మము భక్తి ఎటువలెఁ బాదుకొని యుండున్ నిరపరాధి యొకండు లేఁ డని నిక్కముగఁ గనపచ్చుచున్నది పరమ దేవుఁడు క్రీస్తు కృతమునఁ పాపులను రక్షింపవలయును ||నిజము||