కీర్తనలు

291. శాశ్వత ధనము

రాగం: నాట|తాళం: ఏక|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను నిరత ముండెడి ధనమును ||ధరణి||
1.  యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని వేగము దివ్య వరముగ నమ్మికన్ ||ధరణి||
2.  విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న నీకుఁ గల్గు వేద నాధికంబుపో ||ధరణి||
3.  పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ మిచ్చిన పరమధాముని నమ్ముమీ ||ధరణి||
4.  తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు ||ధరణి||
5.  దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు మిత్ర నేట నెచట వెదకినన్ ||ధరణి||