కీర్తనలు

280. ప్రభురాత్రి సంస్కారవిందు

రాగం: కేదారి|తాళం: అట|రచయిత: వి. డి. జాన్ సుందరరావు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన కృపావిందు తోరణంబగు మేడ గదిలో జేరి శిష్యుల తోడ సిలువ భారమున్ మదినెంచి నెరపిన భావ గర్భితమైన విందు ||చేరి||
1.  జీవాహారము దైవసుతుడే పరమ జీవజలముల దాత యితడే జీవనాధుని రక్త మేనులు జీవానాహారములు కాగా చావును దొల గించి మృతులస జీవులనుగా మార్చువిందు ||చేరి||
2.  కారుణ్యనిధి యేసు రాజు నరుల గావగ బలియైన రోజు భారమైన సిలువ కెరయై పాప భారము పరిహరింప ధారవోసిన పుణ్యరక్తపు ధారలన్ దలపోయు విందు ||చేరి||
3.  దాసగణముల బ్రోవనెంచి రుధిర ధారలను గార్చిభరించి భాసు రంబగు నవ నిబంధన జేసి సంఘ పునాది వేసి వాసి మీరగ నిత్య జీవము బోసినట్టి యేసు విందు ||చేరి||
4.  పాప పరిహారార్థముకై క్రీస్తు పడిన ఘోరబాధ కొరకై యేపు దనరగ స్తుతులుబాడుచు యేసునాధుని రాకవరకు ఆపకుండగ సత్ప్రసాదము నందుకొని బలమొంద రండి ||చేరి||
5.  విందుతో మొదలిడిన సేవ యేసు విందుతో ముగియించె బ్రోవ విందులోగల మర్మమేదియొ విపులముగ బోధించు క్రీస్తున్ డెందమున ధ్యానించి యాయన యందె నమ్మిక గలిగియుందము ||చేరి||