← కీర్తనలు

279. ప్రభు రాత్రి భోజన మాచరించునపుడు దీవెన గోరుట

రాగం: హునేని|తాళం: త్రిపుట|రచయిత: మురారి దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవా దీవించు మిప్పుడు దీన జనాళిన్ గావ రా రమ్మెల్లప్పుడు నీ వరగద్దెచుట్టు నిజ దాసు లిటులఁ గూడి పావన సంస్కారమును బంచి పాలొందుచుండ ||దేవా||
1.  మముఁ గావ నైదు గాయముల్ బొందిన దేవ సముఁడా నీ రక్త కాయముల్ విమలింపు భక్తి ద్వారా వీక్షించి మనసులందు అమిత దుః ఖ మొందుటచే నలిగిన భక్త జనులన్ ||దేవా||
2.  నీ రాజ్యమునకు మముఁ జేర్ప నిజము మా పాప ఘోర శాపమ్ములన్ దీర్ప నోరిమిచే మా కొరకు దారుణముగ నొందిన క్రూర మరణమును దలఁచి కుములుచున్న హృదయులను ||దేవా||
3.  కోరి నినుఁ గొలుచు భక్తుల కోరిక లభివృద్ది గా రాజిలఁజేయు శక్తుల ధారాళముగ నొసంగు ధనాత్ముండ నీ దివ్యా కార మందుండి యీ సం స్కార సమయమున మమ్ము ||దేవా||
4.  మా దారిద్ర్యములు బాపనే పాపభారంపు మ్రాను నీ దివ్య మూపుననే గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో బాధ లొందితి వనుచు బహుగా దుఃఖించు మమ్ము ||దేవా||
5.  నీ వీ విధంపు మరణముచే నిజముగా మమ్ము జీవింపఁజేసి నిల్పుటచే పావనదేవ మే మీ ప్రభు సంస్కారమ్ము మా మా జీవాత్మ లాదరణకై జే మనముగఁ గైకొనను ||దేవా||