← కీర్తనలు

278. జీవాహారము

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: ఏ. బి. మాసిలామణి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద దీర్చుము జీవనపథములో చీకటి పడువేళ జీర్ణించు కొనిపోవు జీవితాశలఁ బెంచ ||జీవా||
1.  విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో నీ వివిధసుభోజ్యంబులన్ విచ్ఛిన్నమైన నీ విమల దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి, తినుచుందు ||జీవా||
2.  రుధిర ధారలలోన ఋజువౌ నీ ప్రేమలు రూపుమాయును పాపము ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత ఋణభారములు దీరి రుచి యించు నా బ్రతుకు ||జీవా||
3.  భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలియించు యీహోమము ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతిరక్త బిందువు ||జీవా||
4.  ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధించు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును దేవా ||జీవా||