పల్లవి:ఓ దయానిలయా! ప్రభువా! మా కున్న స్వనీతి బలముగాక నీ దయాహృదయంబె నమ్ముచు నీదగు బల్లను జేరఁదెగించితి ||మో దయా||
1. లేదు యోగ్యత బల్లకు దిగువ లేకిని నేరుకొనఁగనయినన్ మాదుగతిఁ గరుణించియు నెపుడు మార్పునులేని ప్రభుండవైతివి ||ఓ దయా||
2. ఓ ప్రభుండా! కావున మా పా పోద్భూతంబగు శారీరాత్మల నీ ప్రియంబగు క్రీస్తుతనువున నెత్తుటఁ బరిశుద్ధంబగునటుల ||ఓ దయా||
3. ఆయన మాలోఁబరగను మే మాయనలో జీవింపగను నీ యుగాం తముదాఁ క నేకత నీతో జీవించులాగుననో ||ఓ దయా||
4. యుక్తముగా నాయన మాంసమును నోరెముగా భుజియింపను దన దగు రక్తము మేమందఱమును ద్రావను రాగంబడరఁగ దయ చేయుము ప్రభు ||ఓ దయా||
