కీర్తనలు

276. ప్రభురాత్రి భోజనము కొరకు సిద్ధపడుట

రాగం: ఆనందభైరవి|తాళం: ఏక|రచయిత: రావూరి దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము పాప మంత వీడుమా వినుము నేఁడు యేసు నీకు ఘనముగాను విందుఁ జేసి నినుఁ దలచి చేరవచ్చె ఘనుని వెల్గులోని కేగుము ||మనస||
1.  హృదయ మనెడు తలుపుఁ దట్టుచుఁ ప్రభు యేసు నిలచి సదయుఁ డిదిగో నిన్నుఁ బిలుచుచు ఎదురు జూచుచుండు విభుని పదయుగమున కెరగి మ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము సదముల మగు ప్రేమఁ జూపి ||మనస||
2.  ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ వరములును ధనము నరులు బొందు చుందు రుచితము పరమ రక్షకుం డొసంగు వరశరీర రక్తములకు ధరణి రత్న రాసులైనఁ జాలువా మరేవి యైన ||మనస||
3.  ఎందుఁ గానరాని ప్రేమను జూపించి నీకై పొందుగాఁ దన ప్రాణ మిచ్చెను చిందిన రక్తమును యాగ మంది నట్టి శరీరంబు నందముగను రాత్రి భోజ నంబు నందు సిద్ధపరచె ||మనస||
4.  యేసు తనదు బల్లమీఁను సుజీవ మిచ్చు నెల్ల నష్టములు నశించును భాసురముగ మోక్షమునని వాసివై శ్రీ యేసుతోడ యీ సుభో జనంబు దినుట కాశీర్వాదములు నొసంగు ||మనస||