275. క్రీస్తును నమ్మి బాప్తిస్మము పొంద రండి

రాగం: రేగుప్తి • తాళం: ఆది
పల్లవి:రండి రండి సువార్తబోధ విన రారోజనులారా నిండు మనంబుల కోర్కెలూరగను నిజరక్షకుఁడగు యేసునిఁ జేర ||రండి||
1. పాపము లెడ బాపను యిలకరిగిన ప్రభువు మహిమ వినుఁడి మీ మీ పాపములను దలపోసి హృదయముల పశ్చాత్తాపపడి యా పరమగురుని నామముద్వారా ననుసరించి ముంచడముఁ బొందు ||రండి||
2. తన మహిమను బలమును దైవత్వము తగ్గించుకొని వడి యప్పుడు తన సేవకుఁడని మదిఁదలపోయని తగు నీతిని గనుఁడీ క్రీస్తుండును బాప్తి స్తు డు యోహానునిచే మునుకొని యోర్దాన్నదిలో ముంచుటగని ||రండి||
3. మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో ముంచబడినరీతి నిప్పుడు గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు గైకొనుటది నీతి మరువక స్థిరముగ మీ మనముల నెల్ల ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగఁజేర ||రండి||
4. తల్లులు తమ బిడ్డల కాశీర్వాదము లిమ్మని తేగా నప్పుడు చల్లగ బాలుర కాశీర్వాద మెసఁగె ప్రభు విదిగాక క్రీస్తుఁడు తొల్లి జనములకు ముంచడ మిచ్చిన టెల్ల విధులలేదు వేదమున ||రండి||
5. అందుచేత వేదమున బాప్తిస్తుండనఁబడె యోహాను ఇప్పుడు పొందుగ ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను మీరలు నందఱు విన సత్య వేదవాక్యము సందియములు విడి సాగి వేగమున ||రండి||