కీర్తనలు

274. పెద్దల బాప్తిస్మము

రాగం: నవరోజు|తాళం: అట|రచయిత: విలియం డాకన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభు సెల విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు||
1.  నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగా గాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధ శ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది ||యాచరించు||
2.  భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖ స్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికు ల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి ||యాచరించు||
3.  పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌ నీదైవత్వచి హ్నముతోడను గూడ సరవిగా దతియను బొందె దెరగున నీబప్తి స్తోదకములయు బరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు నిన్ను ||యాచరించు||
4.  పరయానంద వదనము నీ దరికరాఁగిగోరు వీరి న్నీ పరమ కృపన్ దీవించి నీ కరుణా కటాక్షేక్షన్ స్థిరతఁ బాంచియాత్మలకు నీ మహిమ కిరణములు నెరపు మో అభువాయని నిన్ను వేడుచు ||నాచరించు||