పల్లవి:యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును యేసొసంగె గొప్ప యాజ్ఞను దాసులునుగఁ జేయ బోయి ధరణిమీఁది రాష్ట్రములకు ఆ సను బాప్తిస్మ మిచ్చి నా సుబోధ నేర్పుఁడనుచు ||యేసొసంగె||
1. జనక కుమారాత్మల పేర బాప్తిస్మ మియ్యఁ చనుడు మీరు సకల దిశలను తనయు లైనఁ తల్లులైనఁ తండ్రులైనఁ బొందవచ్చుఁ దగిన రీతి దాని నిపుడు తండ్రియైన దైవ కృపను ||యేసొసంగె||
2. బాలు రెల్ల బొందవచ్చును బాప్తిస్మ మిపుడు జాలిఁ జూపు క్రీస్తు సెలవున బాలు రందుఁ బ్రేమ నుంచి ప్రభువు పిలుచు వారి నెల్లఁ జాల మేలు సేయ గోరి సకల కాలముల యందు ||యేసొసంగె||
3. పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ చేత విందుఁ గలుగు మనుజు లందరు మంద బుద్ధి విడిచి పెట్టి మహిమ గల్గు దేవు గొల్వ నందము గను లేచి రండి హర్ష పూర్ణు లగుచు మీరు ||యేసొసంగె||
