పల్లవి:దేవా శిశువుల( దెచ్చితిమి నీవు దీవించువీరల దివ్య కృపమీర||దేవ||
1. వీరు పొందిన బాప్తిస్మంబు గురుతు వీరు నీవా రన విశదపరపంగా వీరిపైఁ గురిపించు దయను వేగ వీరికిఁ గలుగంగ విజ్ఞాన ధనము||దేవ||
2. నీ వొసఁగు శిశువుల మాకు దేవ నీవ చేర్చికొనుము నీవ కాపాడు జీవ మార్గము నందు నిలుపు నిత్య జీవంబు దయచేసి శ్రీ యేసు కఠినన్ ||దేవ||
3. విమలాత్మ బాప్తిస్మ మొసఁగి వీరి విమలులఁ జేయుము ప్రీతిని దేవా క్షమ భక్తిప్రేమ శాంతుల నొసంగు శ్రమముల వెలుఁగంగ సత్య సాక్షులుగా ||దేవ||
4. వీరలకుఁ దోడై యుండుము తండ్రి వీరలఁ జూడుము వివిధ మార్గ ముల వీరు లోకము విడుచు నపుడు దయను వీరలఁ జేర్చుము విమ లానందమున ||దేవ||
