← కీర్తనలు

271. ప్రభుని బాప్తిస్మము

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుఁడగు మరియా తనయుని మహిమలు చెవులార ||వినరే||
1.  తన కన్నను ముందు యోహా నను నతఁ డింపొందు ఘనతర మగును ప్రవచనముఁబ ల్కెను భూజను లందు ||వినరే||
2.  అతఁడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్ ||వినరే||
3.  న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయతఁ గనుపఱచి శ్రేయ పతి బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు ||వినరే||
4.  పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు భప్రభ లీనుచుఁ ప్రభువు మీఁద వ్రాలెన్ ||వినరే||
5.  ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితఁడు ప్రియం బౌ కుమారుఁడా నంద మొంది రనుచు ||వినరే||
6.  అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో క్ష కుశలవార్తను జాటంగను దొడఁగెన్ ||వినరే||
7.  ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం బమృత మేసు ద యా నిధి మన కొసంగున్ ||వినరే||