కీర్తనలు

270. సేవకులకొరకైన దీవెన

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: పంతగాని పరదేశి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దీవెనల నిడు దేవా నీదు సేవకై వెడలెడు దీనులపైఁ పావనాత్మ నంపుము పనులలో నడిపింపుము కేవలంబుగ మా తనువులు నీ సేవకై యర్పింప గజేయుము ||దీవెనల||
1.  మాటిమాటికి బాపయుతంబౌ మార్గమునఁ జను మనసులఁ ద్రుంచి మేటి క్రీస్తుని నామా మృతముఁ గ్రోలుచు మేమా పాటున నాత్మల రక్షణకై పనులు సల్ప(గ బంపుము కృపచే ||దీవెనల||
2.  దివ్య బోధ లెదను గల్గి దీనతను రక్షణ మార్గమును భవ్యముగ బోధింపఁ బరమార్థ మెఱిగింప సేవ్య నేర్పవె దిన దినమును నీ సేవకాళికి నీ మర్మముల ||దీవెనల||
3.  దురిత రోగాదులచే మిగులఁ తూలి చను మనుజాళికి నీవే పరమ విశ్రాంతి నిడు వరదుఁడ వంచుఁగడు వెరవునను బోధింపంగను నీ వర ములతో నింపుము దాసులను ||దీవెనల||
4.  గ్రామ సంఘంబులను బడుల క్షేమముగఁ గాపాడి పెంప ఓ మహాత్మ నీ కృప తో మమ్ముఁ గాచి సదా స్వామి మాలో నీవును నీలో మేము మనగను బ్రోవు మామేన్ ||దీవెనల||