కీర్తనలు

269. బోధకులకొరకైన ప్రార్థన

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: విలియం బెర్రి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||
1.  వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడు గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||
2.  సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||
3.  దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||
4.  తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||
5.  మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై శోధనంబులు పొర్లి రాకుండాదరింప ||నడుగు||
6.  దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||
7.  రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని ||న్నడుగు||
8.  ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||