← కీర్తనలు

261. ఐక్యత

రాగం: ఖరహర ప్రియ|తాళం: ఆది|రచయిత: సరెళ్ల సమూయేలు సుబ్బయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమ ప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధ మున ||సమ||
1.  దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁ గూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ ||సమ||
2.  యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ దండ్రి నీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై ||సమ||