← కీర్తనలు

260. సంఘీభావము బలము

రాగం: కమాసు|తాళం: ఆది|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత మేలు మనోహరము ||ఎల్ల||
1.  ధరణిలో నహరోను తలనుండి దిగ జారు పరిమళ తైలంబు వలె నద్ది తనరారు ||ఎల్ల||
2.  వెలయు సీయోను కొం డల పైకి దిగి వచ్చు నల హెర్మోను మంచు వలె నద్ది చెల్వారు ||ఎల్ల||
3.  తరంతరం బాశీర్వా దము నిత్య జీవంబు స్థిరముగా నందుండ సెల విడెను దేవుండు ||ఎల్ల||
4.  జనక తన యాత్మకును ఘన మహిమ మగుఁగాక మును పిప్పుడున్ యుగ ముల కగును గా కామేన్ ||ఎల్ల||