← కీర్తనలు

262. క్రైస్తవ సంఘ బాధ్యతలు

రాగం: ఆహిరి|తాళం: ఆది|రచయిత: ఎం.ఎల్. మోజెస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును పరిమళ వాసనగానుండ ప్రభువు చిత్తమును పరిగణించుటయె సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||
1.  దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ ప్రతిష్టింపను వారిని సంఘమ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
2.  యువకులు రేపటి సంఘము నందున నాయుకు లౌదురు నయముగను పావనులుగ నిలఁ జేయను వారిని సంఘము నీ బాధ్యత గాదా? ||ప్రభు||
3.  బాప్తిస్మమును కృపా ప్రసాదములు ప్రభు వెంచెను పరిశుద్ధముగ ఘనముగ వాటిని గైకొన నిరతము సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||
4.  దేవుడు జతపర్చిన దాంపత్యము భావములర బంధుత్వములున్ సవ్యంబుగసరి జేయఁగ వాటిని సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
5.  పామర జనములు ప్రభు నెఱుంగక పెడ మార్గంబుల దిరుగగను మానుగ రక్షణ మార్గము జూపుట సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
6.  క్రైస్తవ దాతృత్వము నందెదుగుట కర్తను కీర్తించుట యౌను దశమ భాగములు దాత కొసంగను సంఘ మ నీ బాధ్యత గాదా? ||ప్రభు||