కీర్తనలు

256. దైవ వాక్యము

రాగం: యదుకులకాంభోజి|తాళం: ఆది|రచయిత: జేకబ్ చేంబర్లేన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగాను లేఖనముల నిచ్చె మాకు భూమిపై ||మమ్ము||
1.  మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు మాస్థితి మిగులఁ దేటగ నందులో ||మమ్ము||
2.  పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ము||
3.  పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు ||మమ్ము||
4.  సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా ||మమ్ము||