← కీర్తనలు

255. దేవుని వాక్యానందము

రాగం: మోహన|తాళం: అట|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సుఖ మిచ్చెగద మాకు ప్రభుయేసువా నీ సురుచిరమగు వాక్కు నిఖిలకల్మష వనమునకు దవ శిఖి శిఖిలవలె గాల్చు నీదగు ముఖవికాసిత వాక్యములు బహు సుఖము లొసఁగు తవాశ్రితాళికి ||సుఖ మిచ్చె||
1.  జగతిలోపల మెండుగ నుండిన వివిధ మగు శాస్త్రములు జూడఁగ మిగుల గందరగోళమై మరి యొకటి కొకటి విరుద్ధముగ మ ర్త్యగణ కల్పిత మగుచు నున్నవి తగని వని ద్రోచితిమి వాటిని ||సుఖ మిచ్చె||
2.  నీ వాక్యముల భావము నమ్మిన పాపి జీవుల కది జీవము కేవలం బగు ధర్మశాస్త్రము దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు ఈ వసుధఁగల సర్వ పాపులఁ బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను ||సుఖ మిచ్చె||