← కీర్తనలు

257. దేవుని వాక్యము

రాగం: కాపి|తాళం: ఏక|రచయిత: గున్నాబత్తుల సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు జీవమునకు నాస్పదంబు చిరమగు ధనంబు భావంబుల మార్చు నంబు బహుళ సాధనంబు ||శ్రీ||
1.  పాప తతికి నాయుధంబు పాపి కాశ్రయంబు భూపతులకు దుస్తరంబు పుణ్య సాధనంబు శాప మడంచెడు శరంబు జగతికి విభవంబు ||శ్రీ||
2.  స్వాతంత్ర్య మిడు దనంబు సర్వశ్రేయంబు ఘాతకులకు ఖడ్గంబు నీతికినిలయంబు ప్రీతిని గరపెడు విధంబు ఖ్యాతికిఁ బథంబు ||శ్రీ||
3.  సత్య విరాజితంబు నిత్య శోభితంబు భృత్య వరుల సంచకరము భీతున కభయంబు చేతో విభవంబు సుగుణ శిష్యుల హారంబు ||శ్రీ||
4.  కర్తఁ జూపు నద్దంబు ఘనమహాద్భుతంబు దురితతతికి నస్త్రంబు దు ఖశోషణంబు పరమోపదేశంబు బహుళమానితంబు ||శ్రీ||
5.  సర్వజనులకును హితంబు సౌఖ్యసాధనంబు శాంతికి నిజమార్గంబు జగడముల హరంబు జగము నంతకును వరంబు సత్యవిజయంబు ||శ్రీ||
6.  కోలాహల కారణంబు చాల ప్రాచీనంబు మూలమౌ ధనంబు జగము నేలెడి తంత్రంబు జాలియె దన సూత్రంబు మేలు భూషణంబు ||శ్రీ||
7.  జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు దాని బోధనంబు దీనజనుల కర్థంబు దివ్య శోభితంబు మానితభక్తిని దినంబు మానని పఠనంబు ||శ్రీ||