← కీర్తనలు

254. ప్రభుని వాక్యామృతము

రాగం: ఖరహరప్రియ|తాళం: ఆది|రచయిత: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రబలంబుగ నీ వాక్యం బనెడి విభవామృతము కురియఁజేసి ||ప్రభువా||
1.  వాడియున్నట్టి యీ మోడు వృక్షములే వడిగాఁ జిగురు పెట్టి వూచి గాఢంబుగను ఫలము లియ్యఁ ||ప్రభువా||
2.  నీ వాక్యానల శ్రీ దేవా పంపుము భావాఘముల మాడ్చి మనముల్ పావనంబు బొందునటులఁ ||ప్రభువా||
3.  ధరఁ జీకటి కిదియే వే గురుఁ చుక్క ప్రభువా సరళంబుగా యాత్రికులు నడచి పరమపదంబును బొందఁగఁ జేయుచుఁ ||ప్రభువా||