పల్లవి:
దేవుని గ్రంధము దినదినము చదువుము పావనమార్గము జీవము సత్యము ||దేవుని||
1. ఎంచి తలంచుము మించిన గ్రంథము అంచితముగను రెం డంచుల ఖడ్గము ||దేవుని||
2. తేనియమధురము తినుము ప్రతిదినము ధ్యానముసేయుము దానన బ్రదుకుము ||దేవుని||
3. నాధుని వాక్యము అరయుము భాగ్యము పాదపు దీపము భక్తుల కవచము ||దేవుని||
4. ఆత్మల శాంతము అభయము శ్రేయము ఆత్మలకు బలము అనయము సౌఖ్యము ||దేవుని||
5. పాపము శాపము పలువిధతాపము పాపును వేగము దాపున జేరుము ||దేవుని||
6. మదినిది నిరతము పదిలము చేయుము సదమల జ్ఞానము సవిధము మోక్షము ||దేవుని||
