← కీర్తనలు

238. పరిశుద్ధాత్మకొరకు వేఁడుట

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: మామిళ్ల యెషయా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దైవాత్మా దిగుము దాసుల పైని నీ దయా దృష్టిఁ పారజేయుము ప్రేమన్ నింపు దేవా యాత్ముండ దిగుము మమ్ముల శుద్ధీకరించుము దయారసముచే ||దైవాత్మా||
1.  దైవాత్మా దిగుము ప్రవక్తలు పూర్వంబు నీదు ప్రేరణవలనఁ బ్రవచించిరి పావురమా దిగి మాలో వసించుము పాపుము చీఁకటి వెలుఁగుచు మాలో ||దైవాత్మా||
2.  రమ్ము ఓ యున్నతంపు ఆత్మా నాలుగు దెసల నుండి మమ్ముల నావ రించు రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు గానగు లోకుల మీదికి ముదమున ||దైవాత్మా||
3.  మే మజ్ఞానాంధకారమునను మునిఁగితిమి గాన చెదరఁగఁజేయు మంధకారము పామర జనులకుఁ బేర్మితో నొసఁగు ను జ్ఞాన ప్రకా శము నిల్పుము మాలో ||దైవాత్మా||